సంధ్యాసమయం-వానజల్లు
![]() |
సంధ్యాసమయం – వానజల్లు
తెలిమబ్బులు లేగదూడల నోట పాలనురగ లెక్క
ఆట స్థలంలో పసిపిల్లల గెంతులు
ఆకాశన మెరుపుల విరుపులు
దీపావళి తారజువ్వల లెక్క
నిశీధిలో పిడుగుల గాండ్రింపులు
పండగ పూట పెద్ద డోలు చప్పుడు లెక్క
సంధ్యాసమయం, వానజల్లు
ధరణి విడిచే పరిమళము – విరబూసిన చిరుమల్లెల సువాసన లెక్క
ఆరుద్ర పురుగులు -పడుచు పిల్ల నుదుటపై కుంకుమ బొట్టు లెక్క
పిల్లగాలి లేత పైరుతో చిలిపి అల్లరి
బావ-మరదలి సరసం లెక్క
సంధ్యాసమయం, వానజల్లు
ఇంటింటా కారం మంట,
ఇంటాబయటా చిరుతిండ్లుకై కిటకిట
పొలంలో పని వేగిరం చేసి, తిరోగమనంలో రైతన్న – గబగబ గూటికి చేరే గవ్వల లెక్క
సంద్యాసమయం, వానజల్లు
చిరుకొండలు, నీలిమబ్బులు కలయికకై విఫలయత్నం – తొలి తొలి పరిచయాన ప్రేమికుల చిరు ముద్దుకై పడే ఆరాటం లెక్క
సంద్యాసమయం, వానజల్లునీ
లాకాశం, నీలి సముద్రం ముడిపడే సమయం,జతకలిసే సమయం- ఏకాంత సమయం