కుర్రతనం, వెర్రితనం
వయస్సు భేదానుసారం గుంపులు,
గుంపు గుంపుకి కుర్రనాయకులు
దాగుడు మూతలు- దొంగతనాలు
ఈలలు – గోలలు
ఆటలు -పాటలు
పశువుల తోకలు- చెరువుల్లో ఈతలు
కాలువలో జలకాలు – బావుల్లో గెంతులు
తోటల్లో వంటటాలు, కోతి కొమ్మాచ్ఛాటలు
వంగుళ్ళు – దూకుళ్ళు, కర్రబిళ్ళాటలు,
తోలమాలితో తిట్లు, అమ్మతో చీవాట్లు
కుర్రతనం, వెర్రితనం
నూనుగు మీసాలు, కొత్తబట్టలకై అలకలు
శరీర సౌందర్యం పై మోజు, ఆడపిల్లలపై క్రేజు
కాగితపు రాకేట్లు, బహుమతులు లాకెట్లు
ప్రేమ లేఖలు, ఓర చూపులు
అందానికి మెరుగులు, రూపానికి సొబగులు
తొలిప్రేమలు – శృంగార, విరహ గీతాలు
ప్రేమించబడుటకు ఆరాటాలు, పోరాటాలు
విజయాలు, అవిజయాలు
బానిసగా మిగలటం, విజయ బావుటా ఎగరేయడం.