జగన్మోహన రెడ్డి- JAGAN
జగనన్న జగనన్న, జగనన్న జగనన్న
జగమంతా జగనన్నా, జనమంతా జగనన్నా
వెలసిపోతున్న ఆంధ్రరాష్ట్రమనే సూరీడికి తూరుపు దిక్కై నిలిచావు.
రెక్క విరిగి నేలకొరిగిన రైతన్నకి ఆపద్భాందవుడై భరోసా నిచ్చావు
కషాయి మూకత రక్కసి కొరల కాలకూట విషం దాటికి జైలు పాలయ్యావు
ఉగ్రరూప త్రినేత్రుడై విధిని ఎదురీది ఎదురొడ్డి నిలబడ్డావు కష్టాలు చవి చూశావు, కన్నీళ్ళు నువ్వు తుడిచావు
వందల మైళ్ళు నడిచావు, వేలమందిని నడిపిస్తున్నావు.
జగనన్న జగనన్న, జగనన్న జగనన్న
జగమంతా జగనన్నా జనమంతా జగనన్న
అమ్మతో నడిచావు, ప్రతి అమ్మని కలిశావు అక్కతో కదిలావు, అక్క చెల్లిలు అన్నదమ్ముల్ని కదలించావు
అక్రమ ఆస్తులు అన్నారు, అక్రమ కేసులు పెట్టారు. పంటి బిగువన బాధన భరించినావు, నేర్పుతో ఓర్పు వహించావు
రంగులు మార్చే ఊసరవెల్లి ఎత్తుల్ని పాదయాత్రతో చిత్తులు చేశావు. జిత్తులు మారా నక్కపై దండయాత్ర చేసి గద్దె దించావు
జగనన్న జగనన్న, జగనన్న జగనన్న.
జగమంతా జగనన్నా జనమంతా జగనన్నా
ఆవిరవుతున్న అడుగు-బడుగు, ముసలి ముతక బతుకుల ఆశలకు ఊపిరందించావు
రోడ్లపై పరిగెడుతూ బ్రతుకుతున్న ప్రతి బతుకుబండికి ఇందనమయ్యావు
అరాచక శక్తుల ఉక్కు పిడికిలి నుండి రాజన్న రాజ్యాన్ని ఒడుపుగా విడిపించావు
కాలంతో సంబంధం లేకుండా చివరికి ధర్మమే విజేత అని నిరూపించావు
ఆదరాభిమానాలతో అందలమెక్కావు, కొదమ సింహమై సింహసనంపై గర్జిస్తునిస్తున్నావు.