మగువ – స్త్రీ – అతివ – కన్య – తరుణి – రమణి

By venkat ramesh

Published on:

 మగువ – స్త్రీ –  అతివ  – కన్య – తరుణి – రమణమగువ - స్త్రీ -  అతివ  - కన్య - తరుణి - రమణి

ప్రపంచమంతా ప్రేమకు పుట్టినిల్లు నీవు

కుటుంబం అనే సౌధానికి పునాది నీవు

అలికిడికి హడావిడికి చిరునామా నీవు

మగువ - స్త్రీ -  అతివ  - కన్య - తరుణి - రమణి

మగువా అన్నా, అతివా అన్నా కలికి అన్నా, కన్య అన్నా ఏ రూపమైనా అపురూపమేగా నీవు

అమ్మా అన్నా, అత్తా అన్నా. అక్కా అన్నా, చెల్లి అన్నా ఏ బంధమైనా అనుబంధమేగా నీవు

జాలివి నీవు, కరుణవి నీవు సకల సృష్టికి మూలం నీవు

భయము నీవు, ధైర్యం నీవు సమస్త జగతికి హేతువు నీవు

baby-girl-women,telugukavitaluu

నువు నిలిచే ప్రతి నిలయం ఆలయమేగా / ఆలయమవదా నువు పుట్టిన ఏ కోనైనా కోవెలేగా / కోవెల కాదా

శాంతివి నీవు, సహానం నీవు

ఆభరణలే అక్కరలేని అసలైన అందం నీవు

ఓర్పువి నీవు, నేర్పువి నీవు పూజలనడుగ, ప్రార్థలనడగ వరించే అదృష్టం నీవు

Leave a Comment