కోవిడ్-19/కరోనా

By venkat ramesh

Published on:

 కోవిడ్-19 కరోనా

శుభ్రం పాటిద్దాం, దూరం పాటిద్దాం

దైర్యం వహిద్దాం,కరోనాని దూరం చేద్దాం.

పోలిసులతో సహకరిద్దాం, 

కరుడుగట్టిన కరోనా మహమ్మారిని కటకటాలు పాలు చేద్దాం.

వైద్యులకి సహాయ సహకారాలందిద్దాం,

 కరోనా కేన్సర్కి శస్త్ర చికిత్స చేద్దాం.

కొన్ని రోజులు క్రీడలు మానేద్దాం,

కరోనా వికృత క్రీడలు అరికడదాం.

ముఖానికి మాస్కులు ధరిద్దాం,

 కరొనాకి ఊపిరి సలపకుండా చేద్దాం.

శానిటైజర్తో చేతులు కడుక్కుందాం,

 కరోనాని కడిగి పారేద్దాం.

దూరభార ప్రయాణాలు తగ్గిద్దాం, 

కరోనా టైర్లలో   గాలి తీసేద్దాం.

covid-19/corona virus

శుభ్రం పాటిద్దాం,దూరం పాటిద్దాం.

దైర్యం వహిద్దాం, కరోనాని దూరం చేద్దాం.

మద్యం మత్తులో తూగడం మానేద్దాం,

 కరోనాని తుంగలోకి తొక్కుదం.

ఒంటరిగా తిరుగుదాం,

 కరోనాని ఒంటరిని చేద్దాం.

covid-19/corona virus

కరచాలనం మానేదాం,

కరోనాకి స్నేహహస్తాన్ని అందించడం ఆపేద్దాం.

వింత ప్రవర్తనలు విరమిద్దాం,

కరోనా వింత పోకడల్ని తరిమి కోడదాం.

విధిగా ప్రభుత్వం విధించిన విధి విదానాలు చిత్త శుద్దితో పాటిద్దాం కరోనాకి అంతిమ వీడ్కోలు పలుకుందాం.

శుభ్రం పాటిద్దాం, దూరం పాటిద్దాం. 

దైర్యం వహిద్దాం,కరోనాని దూరం చేద్దాం.

Leave a Comment