నేను కూడ ప్రేమించాను
నేను కూడ ప్రేమించాను
ఆర్తిగా, అత్రంగా
అందంగా, అమితానందంగా
అల్లారుముద్దుగా, అపురూపంగా
అభిమానంగా, ఆరాధనగా
తొలిసారి తిరునాళ్ళలో చూసి
మరోసారి మిత్రుడి మ్యారేజీలో చూసి
మరుక్షణం చూపులు కలిశాయి,
యాదృచ్చికంగా మాటలు జరిగాయి
మురునాడు అవతలివాడు తన చూపులకై ఎదురు చూస్తు కాలంతో యుద్ధం
సమయం ఓటమినంగీకరించి ఆమె ఆచూకీనిచ్చింది.
నేను కూడా ప్రేమించాను
ఆమె నవ్వు పరిపూర్ణంగా విచ్చుకున్న పారిజాతపుష్పం ఆమె నడక మేలిమిజాతి నత్తనడక ఆమె లాంగ్యేజి, బాడీలాంగ్యేజిలో చీమలకి హానితల పెట్టని సుతిమెత్తనితనం
ఆమె ఓరచూపు వేటు, భయంకర విషసర్పాలు కాటు ఆమె అరనవ్వులో కోటి కాంతి పుంజాల వెలుగుల జలుగులు
ఆ స్పర్శలో నూర్యదయాన ప్రసరించే వెలుగు రేఖల తాకిడి సమాన స్పందన.
నేను కూడా ప్రేమించాను.
దినదినం బస్టాప్‌లో పడిగాపుల యజ్ఞం
బస్సులో ఆమె సాంగత్యం స్వర్గానికి ప్రయాణం నా చూపుల చురకత్తుల్ని ఆమె మనసు కంటే వేగం, ఆమె వీపు పసిగట్టేది.
బస్సు దిగాక ఊరి చివర సందు మలుపులో ఓరకంట అరనవ్వు నవ్వేది
నేను కూడ ప్రేమించాను.
కొద్ది రోజులు తన వెంట జీవితం
కొద్ది నెల్లో తనే జీవితం
బస్సులో మూగబాషలు
ఆటో రిక్షాలో చిలిపి చేష్ఠలు
ఆ స్నేహం తారాస్థాయికి చేరింది
ప్రేమ పురుడు పోసుకుంది
దురదృష్టం తాండవం చేసింది
ప్రేమకు ఊపిరి ఆగిపోయింది.
నేను కూడ ప్రేమించాను.
![]() |
www.telugukavitaluu.com |
ఒక్కసారిగా హృదయం కంపించింది.
ఒంటరితనం ఆవహించింది.
అపజయం వెక్కిరించింది.
కాలం కదలిపోతుంది.
నిరాశ నిస్పృహలు పోటాపోటీగా వెంటాడుతున్నాయి
జీవితం స్తంభించిపోయింది.
నేను కూడా ప్రేమించాను.
అనుక్షణం అంతర్మధనం,
ప్రతినిత్యం గందరగోళం
మర్ధిస్క సముద్రాన ఎగసిపడే ఆలోచనాకెరటాలు,
నిద్రలేని కన్నీటి రాత్రులు.
నేను కూడ ప్రేమించాను.
![]() |
www.telugukavitaluu.com |
అర్ధం చేసుకున్నాను, ఓపికపట్టాను
తేరుకున్నాను, తరచి చూచాను
నేర్చుకున్నాను, నేర్పు వహించాను
అనుభవించాను ఆచరించాను.
జీవితంలో గెలిచాను, జీవితాన్ని గెలిచాను
కుటుంబ ప్రేమని గెలిచాను.
స్నేహితుల స్నేహం గెలిచాను.
సమాజ ఆదరణ గెలిచాను.
నేను కూడ ప్రేమించాను
ఇది నా విఫలగాధ, తొలి ప్రేమ కథ
తొలి ప్రేమ పరిణీతి అనే కొత్త అధ్యాయానికి కారణం
తొలి ప్రేమ నా విజయానికిమామిడి తోరణం
తొలి ప్రేమ నా బంగారు భవిష్యతకి శ్రీకారం
ఇది నా ప్రేమ ప్రయాణంకాదు, ప్రయానంలో ప్రేమ మాత్రమే తిరిగి ….
నేను కుడా ప్రేమిస్తాను