ఎటుపోతున్నాం?
ఎటుపోతున్నాం, మనం ఎటుపోతున్నాం.
దూరంగా పోతున్నాం, దూరం దూరంగా జరిగిపోతున్నాం.
ఇంట్లో ఉన్న అమ్మకి టేక్ కేర్ చెప్పం
పోన్లో ఉన్న ప్రేయసికి ఐ లవ్ యు చెప్తాం
నాన్న మనకి చాదస్తం
ఆఫీస్ బాస్ తో అడ్డమైన తిట్లు తింటాం
ఇరుగు – పొరుగువారిని కన్నెత్తి కూడా చూడం
పేస్బుక్ లో ఫేస్ పెట్టి ఫేస్ లు వెతుకుతాం
చేతి వంట పాత చింతకాయ పచ్చడి అంటాం
కాస్ట్రీ హోటల్లో రుచి – సుచి లేని చెత్తని తింటాం
![]() |
www.telugukavitaluu.com |
ఎటుపోతున్నాం, మనం ఎటుపోతున్నాం.
దూరంగా పోతున్నాం, దూరం దూరంగా జరిగిపోతున్నాం
ఇంట్లో ముసలివాళ్ళు పాత అయిపోయారంటాం
వైన్ షాప్‌లో పాత మందు వేతుక్కొని తాగుతాం
షోరూంలో, షాపింగ్ మాల్స్‌లో స్వైపింగ్ చేస్తాం.
రోడ్డు పక్క అంగడిలో బొమ్మ దగ్గర పీసు బేరాలాడుతాం
పుస్తకానాకి బదులు ఫోన్ పట్టుకుంటాం
కార్పోరేట్ కంపెనీకి సియిఓ అవ్వాలని కలలు కంటాం.
ఎటుపోతున్నాం?
ఎటుపోతున్నాం, మనం ఎటుపోతున్నాం
దూరంగా పోతున్నాం, దూరం దూరంగా జరిగిపోతున్నాం.
ట్రాఫిక్ సిగ్నల్‌లో అడుక్కొనే పిల్లాడికి రూపాయి వెయ్యం వెంకటేశ్వర స్వామి హుండీలో కోట్లు కుమ్మరిస్తాం.
ఆవేశం అరక్షణం ఆపుకోలేం
యోగ తరగతులకు అడ్మిషన్ తీస్కుంటాం
![]() |
www.telugukavitaluu.com |
అందం ఆర్గానిక్ పంటలు కావాలంటాం
మట్టిని ముట్టుకుంటే డస్ట్ అంటాం, డర్టీ అంటాం
ఎటుపోతున్నాం, మనం ఎటుపోతున్నాం
రియల్ లైఫ్ హీరోస్ ని రికాగ్నెస్ చెయ్యం
రీల్ లైఫ్ హీరోస్ కి పాలాభిషేకం చేస్తాం.
అందరిలో ఉన్నా విడిగా ఒంటరిగా కూర్చుంటాం
సెల్ఫీ కోసం ఒకరిపై ఒకరు ఎగబడతాం
ఒళ్ళు అస్సలు కదపం
జీవితం లో హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదనుకుంటాం.
ఎటుపోతున్నాం?
ఎటుపోతున్నాం, మనం ఎటుపోతున్నాం.
![]() |
www.telugukavitaluu.com |
సొంత పిల్లల పట్ల శ్రద్ధ చూపం
సమాజం చేడిపోయింది అంటాం.
సారాపాకెట్కి, బిర్యానీ పొట్లానికి అమ్ముడుపోతాం ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థనీ నిందిస్తా
మన తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకోం
మనస్తత్వ శాస్త్రం అద్యయనం చేస్తాం.
అంతరిక్షం చుట్టిరాగలం
సూక్షక్రిముల్ని కుడా చంపలేం
సిక్స్ప్యకు, జీరో సైజులు అని ఆరాటపడుతాం
ఆరోగ్యమే మహాబాగ్యం అని మరిచిపోతాం
ఎటుపోతున్నాం, మనం ఎటుపోతున్నాం దూరంగా పోతున్నాం, దూరం దూరంగా పోతున్నాం