స్వామీ వివేకానంద జీవితం పై తెలుగు కవిత
స్వామి వివేకానంద
![]() |
www.telugukavitaluu.com |
గొర్రెల్లా కాదు – సింహాల్లా బ్రతకమంటూ
యువత హృదయల్లో స్ఫూర్తి జ్వాలాగ్ని
నింపేందుకు ఉడయించిన సూర్యుడు ” వివేకానంద”
ప్రియమైన అమెరికా సోదర సోదరిమణుల్లారి అంటూ – చికాగో సభల్లో ఒక్క ప్రసంగంతో భరతభూమి
జవసత్వాన్ని ఖండాంతరాల్లో విస్తరింపజేసిన ధీరోదాత్తుడు, ఈ నరేంద్రదత్తుడు
సమయస్ఫూర్తి ఆయన పాదాక్రాంతం
జ్ఞాపకాశక్తి ఆయన బానిస
ఆయన శరీరవయస్సు కొన్నేళ్ళే (39)
ఆయన ఆత్మవయస్సు ఎన్నేళ్ళో (జనాల గుండెల్లో)
డబ్బులేకపోవడం మనకు తెలిసిన పేదరికం
ఆశయం లేరపోవడం ఆయన చెప్పిన పేదరికం.
గురువును మించిన హంసలాంటి శిష్యుడు
రామకిృష్ణుల అంశలా బ్రతికినవాడు