నేటి సమాజం దాని పోకడల పై – తెలుగు కవిత 2025

By venkat ramesh

Updated on:

 నేటి సమాజం

 

         నేటి సమాజం 2025

నేటి సమాజం, ఇది మేటి సమాజం

ఇది అమాయకుల రక్తం తాగే రక్త సమాజం

నేటి సమాజం, ఇది మేటి సమాజం

ఇది అబలను చరచే క్రూర సమాజం

నేటి సమాజం, ఇది మేటి సమాజం

ఇది రంగు నోట్లకై రంగులు మార్చే బూటక సమాజం

నేటి సమాజం, ఇది మేటి సమాజం

ఇది కనిపెంచినావారి కన్నీరు అక్కరకు రాని ఆటవిక సమాజం

నేటి సమాజం, ఇది మేటి సమాజం

ఇది పిడికెడు మట్టికోసం, పొట్టలుకొట్టే పోటీ సమాజం

నేటి సమాజం, ఇది మేటి సమాజం

ఇది అనార్ధలును, శరణార్థులును ఆదమరిచి,

దేవునికే దానం చేసే సంపన్న సమాజం

నేటి సమాజం :

ఇది మంచి మట్టెకొట్టుకుపోయిన సమాజం

ఇది చెడు చరిత్ర తిరగరాసే సమాజం

ఇది అవసరం ఊడిగం చేస్తున్న సమాజం

ఇది అవకాశం రాజ్యమేలుతున్న సమాజం.

also Read

Leave a Comment