చుట్టాల కుర్రోడు
![]() |
www.telugukavitaluu.com |
చుట్టాల కుర్రోడు
చురకత్తి చూపోడు
ఓరకంట చూశాడా..
గుంటలకి గుండె చెదిరిపోతాది.
చుట్టాల కుర్రోడు
చురుకు చేతలోడు
తొడలు చరిచి తేడాలు చేస్తే
చెమడాలు వొలుస్తాడు.
చుట్టాల కుర్రోడు
చిలిపి చేష్ఠలోడు
కల్లుతాగి కాలరెగరేస్తే
కయ్యానికి కాలు దువ్వుతాడు.
చుట్టాల కుర్రోడు
చక్కనైన చిన్నోడు
చిరాకు లేచిందా
శివతాండవం ఆడుతాడు.