నిలుపగలనా చూపులు
నిలుపగలనా చూపులు క్షణమైనా నీపైన
నిలువగలనా చూడక నిమిషమైనా నా మైనా”
చూస్తేనే నిన్ను, కళ్ళార నేను, ఇంకేమి గుర్తించలేను
వస్తనే నువ్వు, వస్తాదే నవ్వు అదెంటే చెప్పలేను
నాకేమైందో తెలియక అమ్మానాన్న తాయత్తులు కడుతున్నారే
ఈ తడబాటు, తత్తరబాటుకు మూలం నీ యడబాటేలే
ఏమైనా ఏదేమైనా నేనింకా ఈ యద శోద వినలేనే
ఇబ్బడి ముబ్బడి నీ ఊహలతో ఉబ్బి తబ్బిబవుతున్నావే
ధైర్యంగా నీ దరి చేరి నా మనసు గుట్టు విప్పేస్తానే వదిలేస్తావో, చేరదీస్తావో, ఏంచేస్తావో ఏమో నీ ఇష్టంలే.