తెలుగు కవిత ఆన్ తెలుగమ్మాయి

By venkat ramesh

Updated on:

        తెలుగమ్మాయి

ముద్దబంతి మాటలాడితే  నువ్వు

వెండిపూలు వికసిస్తే….  నువ్వు

చెట్టు, చీమ నవ్వితే…..నువ్వు

వాగు, వంక పొంగితే… నువ్వు

కొంటెతనము, చిలిపితనము సగం సగం నువ్వు చురుకుతనం-గడుసుతనం సెరిసగం నువ్వు

కళ్ళాపి వాకిట ముత్యాలముగ్గీ  నువ్వు

చిన్నారి నొసట విబూతి బొట్టే  నువ్వు

అమ్మ ప్రేమకు ప్రతిరూపం నువ్వు

స్నేహానికి కొత్త అర్ధం  నువ్వు

గడుసుతనానికి గౌను వేస్తే  నువ్వు

చిలిపితనానికి చీర కడితే  నువ్వు

మంచి గుణానికి ప్రాణం పోస్తే  నువ్వు

జాలి గుణానికి రూపం గీస్తే  నువ్వు

ప్రమిధలో వెలిగే దీపిక  నువ్వు

కవితలో పలికే భావం నువ్వు

Leave a Comment