మాయదారి మేఘమా -తెలుగు ప్రేమ కవిత 2025

By venkat ramesh

Updated on:

మాయదారి మేఘమా

 మాయదారి మేఘమా – 2025

మాయదారి మేఘమా

చిరుజల్లు చిలికిపోకుమా

ఉన్నపాటుగా కుండపోతగా

 ఊసులు / నవ్వుల వర్షం కురిపించుమా

సడి చేసే ఉరుమై ఉరిమి

వినిపించుమా

వెలిగే మెరుపై మెరిసి

కాస్త కనిపించుమా

నిదురపోని ఎదురుచూపు పై

కాస్త జాలి / కనికరం చూపుమా

కబురులతో కవ్వించుమా

నటనలతో నవ్వించుమా

మాటలతో మైమరిపించుమా

తోడు – నీడై

జంటగా…. ఆలు –మగలై

అడుగు – జాడై

రాత్రి – పగలై

కడదాకా తోడుండుమా

Read more

Leave a Comment