కృషి
హృదయం రగలినీ
రక్తం మరగనీ
వెన్ను విరగనీ
పాదం పగలనీ
సత్తా చాటు
సత్తువ చూపు
లోకం నవ్వునీ
జగం జాలిచుపనీ
ప్రపంచం వదిలిపోని
విశ్వం విలువ ఇవ్వకపోని
చెమట చెందించు
చరిత్ర సృష్టించు
శత్రువుల వైరం పెరిగిపోనీ
స్నేహితుల స్నేహం బలహీనపడనీ
ఆప్తుల అబిమానం తరిగిపోనీ
కుటుంబ బలం దూరమైపోనీ
ఒంటరిగా పోరాడు
విజేతగా నిలబడు
ఏడ్చేవాళ్ళని ఏడ్వనీ
నవ్వేవాళ్ళని నవ్వనీ
పోగిడేవాళ్ళని పోగడనీ
తరిమేవాళ్లని తరమనీ
తురుమేవాళ్ళని తురమని
ఎదురెళ్ళడం నీ లక్షణం
ఆత్మవిశ్వాసం నీ ఆయుధం.