తెలుగు కవిత ఆన్ నీతి 2025
చేతికందినవాడిదొక నీతి
చేతకానివాడిదొక నీతి
అవకాశమున్నోడిదొక నీతి
అవసరమున్నోడిదొక నీతి
ఆకలి మంటదొకనీతి
నిండిన కడుపుదొక నీతి
నీడ పట్టునున్నోడిదొక నీతి
ఎండకు ఎండేవాడిదొక నీతి
కాలి నడకన ఖాళీ కాళ్ళతో నడిచేవాడిదొక నీతి
కారులో కాళ్ళమీద కాళ్ళ వేసుకువెళ్ళేవాడొదక నీతి.