అమ్మ
ఆదిశక్తి అమ్మ అమ్మ
అవతార రూపిని అమ్మ
అనిర్వచనీయ భావం అమ్మ
పసి వయసులో అమ్మ కనుసన్నల్లునే
అమ్మ పాలు తాగుతాం, ఉగ్గుపాలు తాగుతాం బోర్లాపడతాం, బోసి నవ్వులు నవ్వుతాం.
చిలక పలుకులు పలుకుతాం.
బూచిని చూపించి భయాన్ని
చందమామ చూపించి ఇష్టాన్ని
అల్లరి చేస్తే కోపాన్ని
అలిగితే అతి ప్రేమ పరిచయం చేస్తుంది.
![]() |
పడుతూ లేస్తు సైకిల్ తొక్కుతుంటే ఆమె కళ్ళలో ఆనందం ఆదమరుపులో ఎవరి ఏడుపు విన్నాగుండెల్లోఅందోళన
చదువుల్లో, ఆటపాటల్లో ఎదుగుతుంటే ఆత్మీయఆలింగనం
పై చదువులకి పంపిస్తూనే,మనసులోగందరగోళం
గొంగళిపురుగు ప్రాయంలో అమ్మకి మనం ముద్దు సీతాకోకచిలుకగా రెక్కలు రాగానే అమ్మే మనకి హద్దు మనసు మాట వినలనుకుంటాం, తళుకుక్కన మనసులో అమ్మ మెరవగానే ఆగుతాము.
అన్నింటా అమ్మే సర్వస్వం
అమ్మ నుంచి అమ్మాయి వైపు వెళ్తుంటాం
హర్మోన్లు పరుగెడుతాయి, మార్పులు మొదలవుతాయి కాలేజ్ లో వెనకి సీటికి మారుతాం.
జిందగీలో అమ్మని వెనక సీటుకి పంపిస్తాం
అలవాట్లు మారుతాయి.
అమ్యాయిని సింహాసనం ఎక్కిస్తాం
సర్వసుఖాలు, సపర్యాలు చేస్తాం
![]() |
మన ఎదుగుదలలో అమ్మ వయసు పెరుగుదల మరుస్తుంది.
మనపై శ్రద్దలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంది.
మనం కూడా అమ్మ నాన్న అవుతాం.
అమ్మ ప్రేమని పంచుతాం
అమ్మ ప్రేమకి పాత అర్ధం మరచిపోతాం
కొత్త అర్ధం వెతకడం మొదలుపెడతాం.
అమ్మదూరమవుతుంది,బరువవుతుంది,భారమవుతుంది.
అలికిడికి హడావిడికి నిలయమైన అమ్మ
శూన్యానికి చిహ్నం అవుతుంది
మౌన రోదనలో రోజుల్ని గడుపుతుంది.