ఆగదు ఈ లోకం 2025
ఆగదు ఈ లోకం ఆగదు ఈ లోకం, సాగెను ఈ లోకం, ఆగదు నీ కోసం
నట్టేట నువ్వు మునుగుతున్నా, నడి సంద్రంలో నీరుగారిపోతున్నా సాగెను ఈ లోకం, ఆగదు నీకోసం.
ప్రియురాలితో ప్రేమ పరాభవం, ఇల్లాలితో సంసార సాగర బంధకం ,
స్నేహితులు సుదూరం, ఆప్తులు ఆమడ దూరం.
ఆగదు ఈ లోకం, ఆగదు ఈ లోకం, సాగెను ఈ లోకం, ఆగదు నీ కోసం.
ఇరుగు పొరుగు వారు పరుగున రారు, పరాయి వాళ్ళు పట్టించుకోరు ,
నీవు కన్నవారు కానరారు,నిన్ను కన్నవారు కనుమరుగవుతారు.
ఆగదు ఈ లోకం, ఆగదు ఈ లోకం, సాగెను ఈ లోకం, ఆగదు నీ కోసం.
కారుమబ్బులు కమ్ముకున్నా, కల్లోలం అలముకున్నా
చెమట ధారలో కొట్టుమెట్టుడుతున్నా.
ఆగదు ఈ లోకం, ఆగదు ఈ లోకం, సాగెను ఈ లోకం, ఆగదు నీ కోసం.
కష్టాల కడలితో చెలిమి చేస్తున్న, బతుకు భారంతో భుజస్కంధాలు కదేలవుతున్న,
ఉఛ్వాస, నిశ్చాసలే నీ గమ్యానికి చేరువ చేర్చే అడుగులు ఆత్మ విశ్వాసమే నీ ప్రయాణ సాధనం.
జీవన గమనంలో స్వశక్తి పై నమ్మకం అనే పట్టు సడలకపోవడమే నీ అంతిమ విజయం.
ఆగును ఈ లోకం, ఆగును ఈ లోకం
నీ విజయంతో అగును ఈలోకం, నిను సాకెను ఈ లోకం.
ఆగును ఈ లోకం, ఆగును ఈ లోకం
నీ విజయంతో అగును ఈలోకం, నీతో సాగెను ఈ లోకం.