చావు 2025
చావు ఒక పిలవని పేరంటం
కలపని చుట్టరికం
చావుకి అసలు సిగ్గు లేదు
హాస్పటల్స్, డాక్టర్స్ ఉన్నారన్న భయం అంతకన్నా లేదు,
మనిషి ఎంత అసహ్యంచుకున్నా,
తలుపులు మూసివేసినా నీడలా వెంటాడుతూనే ఉంటుంది.
చావుకి అసలు సిగ్గు లేదు.
ఏమో….
మనిషే ఎక్కడో చావును తక్కున అంచనా వేస్తున్నాడేమో,
చిన్న చూపు చూస్తున్నాడేమో,
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు మనిషి,
నిరంతరం చావును ‘ఓ కంట కనిపెట్టలేమో.
చావు ఎత్తులు వేసే జిత్తులమారి.
వేరు, వేరు రూపాలలో, రకరకాల మార్గాల్లో దారి కాస్తునే ఉంటుంది.
వల వేసి వేచే మత్సకారుడిలా ఓపికగా చూస్తాది .
కాలం కలిసి రాగానే తల్లి కోడి తోడు ఉన్నా,
రెప్పపాటులో అమాంతం పిల్లను గెద్దలా తన్నుకుపోతుంది.
కుటుంబాల కళ్ళల్లో కారం కొట్టి వికటాట్టహాసం చేస్తుంది
ఓ మనిషి – జర జాగ్రత్త..