ప్రేమ కవిత 💔💔
నువు లేని నేను
ఎన్నటికీ పూర్తవను
వేల లేని శిధిల౦లా మిగిలున్నాను
నీ జత లేని జన్మ
ఓ చిక్కుల ప్రశ్నా పత్రం
తెలియని బదులు ఏమని ఇస్తాను
నువు రాని ఏ దారైన
స్వర్గానికి రదరైనా
మనసుకది ముళ్ల బాటే
నిలువునా చీల్చుతుందే
లోలోన కాల్చుతుందే
ఎడలేని నీ ఎడబాటే
నిద్ధుర రాదే ,నిలకడ లేదే
పగలు రేయీ నీ తలపులు తరిమినే
కన్నుల నీవే ,కలలా నీవే
నిరంతరం నీ రూపం చూపినే
నా మనసు వేదన ,ఈ మౌన రోదన
నీకెట్టా చెప్పాలి
ఎవ్వరితో కబురే పంపాలి
నా గుండె కోత ,ఆ బ్రహ్మ రాత
నీనెట్టా మార్చాలి
సాయం నే నెవ్వరిని అడగాలి
తెలుగు శృంగార కవిత







