కృష్ణా నగరే మావ పాట (నేనింతే సినిమా) 2025
చోటా సా జిందగి మావ, చీటా సా జిందగీ మావా…
తోడాసా నవ్వు మా, తోడాసా నవ్వు మావా
గ్యారెంటీ లేని… బ్రదుకును
ఘోరంగా ప్రేమిస్తాం.
చావుందని సంగతి… మరిచి ,
ఓత్తిడిలో బ్రతికేస్తాం.
ఉన్నవాటిని వదిలేస్తూ, లేని వాటికై వాటికై పడిచస్తూ
పక్కవాడితో పోలుస్తూ సతమతమవుతాం.
కాకిలాగా కొంచెం తింటూ, కుక్కలాగ పడుకుంటూ.
హంసలాగ బ్రతికేస్తే …హాయిగ ఉంటాం.
ఎన్నో కష్టాలు ఉంటాయి,
ఏవో కన్నీళ్ళు ఉంటాయి.
మనసుంటే మార్గాలు ఉంటాయి.
కన్నీళ్ళు కడతేరి పోతాయి.
స్వార్థం అన్న మాటను వదిలి,
స్నేహం కోసం చెయ్యందిద్దాం
పంటి బిగువున బాధను పట్టి
పెదవంచులతో నవ్వేదాం…