శా: కాఫీ తాగకు సాకు చెప్పి పనులే కావంచు నాఫీసు లో
ఆఫీనమ్మది చిత్తు చేయును సుమా, ఆసాంతమూ దేహమున్
సాఫీగా కసరత్తు చేయ విధిగా సాఫల్య మౌనీ పనుల్
కాఫీ లేకనె పూర్తి చేయు ముసదా కార్యమ్ము నిశ్చింతగా… కోట శర్మ

శా: కాఫీ వీడుము మందగించవు మతుల్ కాఫీలు మానేసినన్
ఆఫీనమ్మది చిత్తు చేయును సుమా, ఆసాంతమూ దేహమున్
సాఫీగా కసరత్తు చేయ విధిగా సాఫల్య మౌనీ పనుల్
కాఫీ లేకనె పూర్తి చేయు ముసదా కార్యమ్ము నిశ్చింతగా… కోట శర్మ

ఆఫీనము = నల్లమందు