దశమత్వమసి

కం.
పదుగురు శిష్యులు నీదుచు
నదమున కావలి తటమ్మునకు చేరగ నా
నదిలో మునిగెనొకడనుచు
పదుగురు యేడ్చిరి గణించి పలు విధములుగన్

తనను విడిచి తక్కిన వా
రిని పలు మారులు గణించిరి యని గని హితుల్
కనపడని పదవ వానిగ
తననే చూపగ నెరింగి దక్కెననుకొనెన్

తనను విడిచి వెదికిన దొర
కని పదవ సహచరుని వలె కనలేమాత్మన్
తను కనుగొన దలచిన నా
త్మను తానేయని యెరింగి తననరయదగున్.. కోట శర్మ