Month: February 2018

తత్వ చింతన – అవస్థాత్రయ వివరణ

తత్వ చింతన – అవస్థాత్రయ వివరణ కం. మెలకువ నిదురయు కలలను త్రిలోక ములలో మనుజుడు తిరుగును నిలలో మెళుకువతో లోకమ్ములు తిలకించగ విదితమగును తీరు తరింపన్ కం. మెలగును తనువును మనసును మెలకువలో, మనసొకటియె మెదలును కలలో కలిపించి లేని జగతిని, కలలుకనని నిదురలోన కనబడ వేవీ! కం. మెలకువ లో కనబడునవి కలలో నుండవు, కలిగిన కల కనుమరుగౌ మెలకువలో, మాయమగు స కలము నిదురలో, సకలము కనునది నీవే…. కోట శర్మ వివరణ: జ్ఞాన మార్గమున ఆత్మవిచారణకు తద్వారా అపరోక్షానుభూతికి అవస్థాత్రయ పరిశీలన మావశ్యకము. జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనగా గాఢనిద్రలు అందరికీ అనుభవములోనున్న విషయాలే. మెలకువగా ఉన్నప్పుడు మనిషి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములతో పాటు అంతఃకరణముతో వ్యవహరిస్తాడు. కాని కలలో కేవలము మనసుతో మాత్రమే మెలగును. కలలు లేని గాఢనిద్ర యందు మనసుకాడా వ్యవహరించదు. కలలో వస్తువులు ప్రాతిభాసికాలు అనగా మిథ్య అయి ఉంటాయి. ఆవస్తువులే మెలకువలో స్థిరంగా, వ్యావహారికంగా ఉంటాయి. కాని ఈ రెండు అవస్థల్లోనూ కలిగే జ్ఞానం మాత్రం ఒకటే. గాఢనిద్రనుండి మేల్కొన్న వ్యక్తికి, నిద్రలో తనకు ఏమీ తెలియలేదు అనే అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం స్మృతిరూపంలో ఉంటోంది. అనుభవం లేకపోతే దాని జ్ఞాపకమే ఉండదు కదా! కాబట్టి గాఢనిద్ర లో “ఏమీ తెలియకపోవటం అనేది ” అనుభవమైనదని తెలుస్తోంది. ఈ అజ్ఞానానుభవస్మృతే మేల్కొన్నప్పుడు కలుగుతోంది. కాబట్టి గాఢనిద్రలో బాహ్యకరణములు, అంతఃకరణము పనిచేయకపోయినప్పటికీ, జ్ఞానముంటుందని తెలుస్తోంది. మూడుస్థితులలోనూ మారిపోతున్న వస్తువులను తాను మారకుండా, సాక్షీరూపంగా, ఏకరూపంగా గమనిస్తున్న జ్ఞానమే ఆత్మ స్వరూపము. నీ అసలు రూపము.. కోట శర్మ సీ. కలయందు మెదలును – కల్ల నిజము గాను కలగనునపుడె యా- కలలు నిజము మెలకువన జగము – మెదలు స్ధిరముగాను లోకమెల్ల నిజము – లౌకికముగ దేహమే నేనన్న- ఊహ వీడి నపుడె నీవు నిత్య మనెడి – నిజము నిజము ఉన్నదంతబ్రహ్మ- మొక్కటన్న నిజము నీవెరిగినపుడె – నీవు నిజము ఆవె. నీది నాది యన్న భేదంబు లేదని పారమార్ధికమున పఱగ దగును నేను నీవు వేరు, మేను నేనేయన్న, శంకరుండు జెప్ప శంక లేల వివరణ: శ్రోత్రాది ఇంద్రియాలు ఉపశమించగా, జాగ్రదావస్థలోని సంస్కారాలవల్ల కలిగిన...

Read More

సరదాగా సన్నివేశము

ప్రజ – పద్యం గ్రూపు లో ఇచ్చిన సరదాగా సన్నివేశము పై వ్రాసినవి 1. మ.కో ఎల్లవేళల వాయుయానము నెంచి సంతసమొందుచున్ వెళ్లదీసెను చాలకాలము విర్రవీగుచు గర్వియై వల్లకాక విమానయానము వార్థిలోపడినట్టులన్ చిల్లిపడ్డటులుండిగుండెన చేతులాడకనుండగా నల్లరైలు శరణ్యమయ్యెఁ గనన్ ధనంజయరావుకున్2. ఉత్పలమాల. తొల్లిట జ్యేష్ఠవర్గమున దూరె టికట్టు కొనంగనాశతో నెల్లలు లేనియల్లటలకేమియు దక్కువ లేనిచందమున్ జెల్లదు నీదు కార్డనగ జిన్నగ విక్రయదారుడంతటన్ జిల్లరలేక చిత్రముగ శ్రీసుతుడే కడు బీదవాడయెన్ 3. కం. తలవంపుకు దలబోవుచు దలపెట్టెను జిల్లరను వెదకుడు తటుకునన్ దెలిసెను దదుపరి లేదని ఫలితము లేవని టికెట్లు పాట్లు పెరుగుచున్ 4. మ.కో దారితోచక చేయయుద్ధము దక్కెనొక్క టికట్టు సా ధారణాళిన బీదవారు సదా చరించెడి పెట్టెలో పోరుచేయగ దూరగల్గెను బూర్తిగా జనులుండగా భూరియత్నము చేసిపొందెను బోగిలో జిరుతానమున్ 5. మకో పిల్లచేతల పెద్దవారలు పెద్దగోలల పిల్లలున్ కల్లుకుండలు ఱెల్లుగడ్డియు గాలిమాటల కేకలు న్నల్లరల్లరి చేయగాజనులంతమంది చిరాకుతో గల్లలాడుచు రావుమిక్కిలి కష్టకాలమునుండగా 6. మకో మెల్లమెల్లగ తోటివారలు మిత్రభాషణ చేయగా నుల్లమందు రవంత యూరటనొందెరావు ప్రశాంతుడై తల్లి సంస్మృతి కల్గనందొక తల్లిమాటవినంగనే పల్లకీ యనిపించె రైలు కృపాబ్ధిలో విహరించగన్ 7. పంచచామరము నిరాశ లేశమైన లేకనే సదా హసింతురే నిరంతరప్రమోదులైన నిత్య సత్య భాగ్యులౌ పరోపకారచిత్తులన్న వారె వాస్తవమ్ముగా ధరిత్రిలో ద్యులోకమీవిధమ్ముగా స్ఫురించగన్ 8. కం. ధనమే యుత్తమమనుకొను ధనంజయుడు ధనముకంటె దానము దయలే ఘనమనుకొని తలచెనిటుల “మనసున్న మనిషి ధనికుడు మహిలో నరయన్” ..కోట...

Read More

తత్వమసి..స్వామి వివేకానందుడి దృష్టాంతము ఆధారంగా

తత్వమసి స్వామి వివేకానందుడి దృష్టాంతము ఆధారంగా మత్తకోకిల తల్లినుండొక పిల్ల సింహము దారి తప్పగ దూరమై వెళ్ళిచేరెను గొర్రెమందన భీతితో విలపించుచున్ యెల్లవేళల గొర్రెగా బ్రతుకీడ్చు చుండెను మందలో నల్లవేరొక సింహమావిషయమ్ము చూసెను వింతగన్ చెంతచేరెను పెద్దసింహము చిన్నగా కడు ప్రీతితో “చింతలెందుకు నీదురూపము సింహమే”నని చెప్పుచున్ భ్రాంతినంతము చేయ సింగపు బల్మి తీరులు తెల్పగన్ స్వంతరూపము గన్న చిన్నది సంతసించెను సింహమై ఉన్న శక్తిని విస్మరించగ నుత్తగొర్రెగ నున్ననా చిన్నసింహపు చందమున్ మరచేను జీవుడు తత్వమున్ ఖిన్నుడయ్యెనవిద్యచే పరికించకన్ తన రూపమున్ విన్నయే పరమౌషధమ్మవివేకమంతము చేయగన్..కోట శర్మ విన్న = విజ్ఞ వివరణ: ఒక సింహము పిల్ల దారి తప్పి జింకలగుంపులో చేరి తను సింహానినన్న విషయము మరచి జింకలలాగా భయపడుతూ బ్రతుకుతూ ఉంటుంది. కొన్నాళ్ల తరువాత దానిని వేరేసింహము చూసి దానికి సరస్సు నీటి లో దాని ప్రతిబింబము చూపి దాని అసలుస్వరూపము తెలియజేస్తుంది. తన నిజస్వరూపజ్ఞానము కలిగాక అది సింహములా ధైర్యంగా బతుకుతుంది. ఇక్కడ దాని అసలు స్వరూపమెప్పుడూ సింహమే. కాని అజ్ఞానము వలన కలిగిన అపోహ వలన జింకలా బ్రతకాల్సివచ్చింది. ఆతరువాత జ్ఞానము కలగి సింహమని తెలుసుకొని సుఖంగా బ్రతికింది. అలాగే మనకు తెలిసినా తెలియకపోయినా మన అసలు రూపము బ్రహ్మమే. అవిద్య వలన దేహాత్మ భావము , అహంకారము, మమకారము, బంధాలూ, దుఃఖాలూ కలుగుతున్నాయి. మనకు జ్ఞానము కలిగాక మనము మన అసలు రూపమైన బ్రహ్మమవుతాము. అందుకనే బ్రహ్మవేదా బ్రహ్మైవభవతి అని శ్రుతివాక్యము. మన అసలు స్వరూపమే సత్, చిత్ ఆనందరూపమైన బ్రహ్మము కాబట్టి మన నిజరూపము లో దుఃఖములకు తావు లేని నిత్యమూ ఆనందమూ మనమే. ఆ ఆత్మజ్ఞాన అపరోక్షానుభూతియే జీవన్ముక్తిYOU ARE A LION I will tell you a story. A lioness in search of prey came upon a flock of sheep, and as she jumped at one of them, she gave birth to a cub and died on the spot. The young lion was brought up in the flock, ate grass, and bleated...

Read More

నాన్న..

నాన్న.. ఉ. సంతతితోడనాడుచును సఖ్యుడుగా మురిపించు నాన్న యా సంతుకు సంప్రదాయమును సన్మతి సంపదలిచ్చు నొజ్జయై సంతతి సంతసించుటకు సంతతమున్ శ్రమియించుచుండి తా సంతసమొందు నాన్న తన సర్వము త్యాగము చేసి వారికై ..కోట...

Read More

ఈశావాస్యోపనిషత్

ఈశావాస్యోపనిషత్-1 సీసం పరమాత్మ తత్త్వమ్ము పరిపూర్ణమైనట్టి దాద్యంతములులేనిదట్టియాత్మ ఆయాత్మనుండియే నావిర్భవించెనీ నశ్వరంబగునట్టి విశ్వమంత నామరూపాదులే నాశమౌ జగతిలో నాభాస జనితమ్ములాత్మలోన భ్రమవీడి జ్ఞానియై పరికించ విశ్వమే పరిపూర్ణమైనట్టి బ్రహ్మమగును ఆవె పూర్ణమీజగత్తు, పూర్ణమా బ్రహ్మము పూర్ణతత్త్వమందు పూర్ణముండు వేద్యమౌ జగత్తవిద్యతొలగినంత పూర్ణతత్త్వముగనె పూర్ణమందు శాంతి మంత్రం: ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే || ఓం శాంతిః శాంతిః శాంతిః | భావము కనిపించని బ్రహ్మము పూర్ణమైనది ఈ దృశ్య ప్రపంచము పూర్ణమైనది అదృశ్యుడయిన పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య ప్రపంచం వెలువడింది. దృశ్య జగత్తును పూర్ణ బ్రహ్మమునుండి వేరు చేసినప్పటికినీ ఆయన పరిపూర్ణుడే. సత్యమైన పరమాత్మ తత్వం పరిపూర్ణమైనది. ఆ పరమాత్మ నుండియే ఈ జగత్తంతా బయట ఉన్నట్లుగా తోచుచున్నది. అనగా ఆ పరమాత్మ కన్నా జగత్తు వేరుగా ఉన్నట్లు ఉన్నదని అర్ధం. కాగా జగత్తు కూడా పరిపూర్ణమైనదే అని చెప్పవలెను. ఎందుకంటే బ్రహ్మము యొక్క వివర్తమే జగత్తు కదా. పరమాత్మ నుండి ఈ జగత్తు వేరుగా, విడిగా తోచిననూ ఇది సత్యం కాదు. పరమాత్మయే సత్యం, పరిపూర్ణము. ఈశావాస్యోపనిషత్ -2. ఉత్పలమాల శాశ్వత మైన నీశ్వరుడె సర్వ జగత్తుల నిండి యుండగన్ నశ్వర నామరూపముల నన్ని జగత్తున వీడుచున్ సదా విశ్వము నీ స్వరూపమను విజ్ఞతతో సిరి కోరకెన్నడున్ విశ్వము నాశ హీనమగు విష్ణుమయమ్మని విశ్వసించుమా ఓం ఈశా వాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ | తేన త్యక్తేన భుఞజీథా మా గృధః కస్య స్విద్ధనమ్ || || ౧ || భావం ఈ జగత్తంతయు నామరూప క్రియా రహితమగు ఈశ్వర స్వరూప మాత్రముగా తిలకింపుము. ఇందలి నామాకృతి క్రియా దులను మనస్సుచేత త్యజించి, స్వరూపమను భోజనమును భుజింపుము. నీ ధనమును గానీ పర ధనమును గాని ఆశించకు. విశ్వమున గల సకలము ఈశ్వరుడేయను నిశ్చయబుద్ది కలిగియుండుము ఈశావాస్యోపనిషత్- 3 ఆటవెలది శాస్త్ర సమ్మతమగు సత్కర్మ మాత్రమే చేసి కోరు నిండు జీవితమును కర్మ ఫలితములను కడతేర్చు కొనుటకు మార్గమిదియె కర్మ మార్గికిలను కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః | ఏవం త్వయి నాన్యథేతో~స్తి న కర్మ లిప్యతే నరే || || ౨ | భావం...

Read More