Author: Kota Sarma

సద్యోజాతుడ..

శా ఆద్యంతమ్ములులేనివాడవట సాద్యంతమ్ము నీవేనటో చోద్యంబే యెటులుద్భవించగలవీశుండౌచు లింగాకృతిన్ సద్యోజాతుడ గుట్టువిప్పిచెపుమా చక్కంగనీతత్త్వమున్ ప్రద్యోతించుము వేద్యుడా కరుణతో ప్రార్ధింతునిన్నెప్పుడున్..కోట...

Read More

కాఫీ తాగకు

శా: కాఫీ తాగకు సాకు చెప్పి పనులే కావంచు నాఫీసు లో ఆఫీనమ్మది చిత్తు చేయును సుమా, ఆసాంతమూ దేహమున్ సాఫీగా కసరత్తు చేయ విధిగా సాఫల్య మౌనీ పనుల్ కాఫీ లేకనె పూర్తి చేయు ముసదా కార్యమ్ము నిశ్చింతగా… కోట శర్మ శా: కాఫీ వీడుము మందగించవు మతుల్ కాఫీలు మానేసినన్ ఆఫీనమ్మది చిత్తు చేయును సుమా, ఆసాంతమూ దేహమున్ సాఫీగా కసరత్తు చేయ విధిగా సాఫల్య మౌనీ పనుల్ కాఫీ లేకనె పూర్తి చేయు ముసదా కార్యమ్ము నిశ్చింతగా… కోట శర్మ ఆఫీనము =...

Read More

దశమత్వమసి

దశమత్వమసి కం. పదుగురు శిష్యులు నీదుచు నదమున కావలి తటమ్మునకు చేరగ నా నదిలో మునిగెనొకడనుచు పదుగురు యేడ్చిరి గణించి పలు విధములుగన్ తనను విడిచి తక్కిన వా రిని పలు మారులు గణించిరి యని గని హితుల్ కనపడని పదవ వానిగ తననే చూపగ నెరింగి దక్కెననుకొనెన్ తనను విడిచి వెదికిన దొర కని పదవ సహచరుని వలె కనలేమాత్మన్ తను కనుగొన దలచిన నా త్మను తానేయని యెరింగి తననరయదగున్.. కోట...

Read More

భజగోవిందము – ద్విపదమాలికలో

భజగోవిందము – ద్విపదమాలికలో 1. భజియించు గోవిందు -భజియించు సతము త్యజియించి మోహమున్ – దరియించు భవము 2. వీడుమత్యాశను -విత్తార్జనమున వీడుమాశలనెల్ల- విమలచిత్తమున సరియైన రీతిలో -సంపదల్ పొంది పరితుష్టి కలిగుండు -బాధలన్ వీడి స్మరియించు గోవిందు -సద్భక్తి తోడ హరియించు పాపము-లామూలముగను 3. వ్యామోహ మొందకు -మతివలను గని యేమార్చు మాంసాదు- లీయందమంత తనువు హేయమ్ముగా -దలచి నీవెపుడు మనసులో చింతించు- మరువకెన్నడును భక్తితో గోవిందు -భజియించు సతము ముక్తికలుగు నీకు -మోహమ్ము తొలగి 4 తామరాకుననీరు -తలకు చందమ్ము గా మనిషి బ్రతు-కతి చంచలమ్ము చింతలపోహలే-జీవితమంత సంతోషమేలేదు- స్వల్పమైనగన శరణువేడుముసదా -సర్వాత్మకుడిని మరుజన్మ తొలగించు- మార్గమున్ దెలుపు 5. ధనమును గడియించు -దనుకనీ పైన ననురాగ మునుచూపు -నాప్తులైనటుల నీమేను ముదిమిలో- నీరసించు తరి నీమేలు నడుగుచు- నినుజేరరెవరు గోవిందు భజియించు -గోప్యమ్ము తెలియ కావించ గలదునీ -కాత్మదర్శనము 6. ఊపిరి నీమేన -నున్నంత వరకె నీపత్ని సుతులునున్- నిను బల్కరింత్రు గాలియాడని మృత- కాయమున్ జూచి ఆలుబిడ్డలునైన -హడలిపోవుదురు భజియించు గోవిందు -భజియించు సతము త్యజియించి మోహమున్ – దరియించు భవము భజగోవిందము – ద్విపదమాలికలో – 2 of 2 (పూర్తి అనువాదము కాదు) 7. ధనమెల్లపుడును బా-ధలనిచ్చునరయ ధన మెట్టి సుఖమీయ-దనియెర్గి యుండు ధనవంతులైనను -దనయుల వలన వణకుదురంతటన్ -భయపడి యిలను భజియించు గోవిందు -భజియించు సతము త్యజియించి మోహమున్ – దరియించు భవము 8. చిరుతడి కాటల -చింతన లెపుడు తరుణుడు కోరును -తరుణిని సతము (బాలుడి కాటల -పాటల చింత వాలుగంటి తలపె-ప్రాయమునందు) వృద్ధుడు చింతల -వృష్టిలో మునుగు శుద్ధాత్మ నెఱుఁగెడి-సుమతులే లేరు భజియించు గోవిందు -భజియించు సతము త్యజియించి మోహమున్ – దరియించు భవము 9. సంతానమెవ్వరు -సతి యెవ్వరరయ వింతైన దీసృష్టి -వివరించి చూడ నీవెవ్వరెచ్చోటు -నీది నిక్కముగ నీవిధంబెట్టిద-ని తెలుసుకొనుము భజియించు గోవిందు -భజియించు సతము త్యజియించి మోహమున్ – దరియించు భవము 10. గడపిన సాధుసాం – గత్యము నందు నడగును బంధము -లన్నిటి యందు బంధముల్ తొలగిన- భ్రమవీడి పోవు అంధకారము వీడి -యణచు మోహమును తిమిరము వీడగ -తిరమౌ మనసు; తి రమగు మనసుకు ధ-రణిలోనె...

Read More