Category: Uncategorized

సద్యోజాతుడ..

శా ఆద్యంతమ్ములులేనివాడవట సాద్యంతమ్ము నీవేనటో చోద్యంబే యెటులుద్భవించగలవీశుండౌచు లింగాకృతిన్ సద్యోజాతుడ గుట్టువిప్పిచెపుమా చక్కంగనీతత్త్వమున్ ప్రద్యోతించుము వేద్యుడా కరుణతో ప్రార్ధింతునిన్నెప్పుడున్..కోట...

Read More

కాఫీ తాగకు

శా: కాఫీ తాగకు సాకు చెప్పి పనులే కావంచు నాఫీసు లో ఆఫీనమ్మది చిత్తు చేయును సుమా, ఆసాంతమూ దేహమున్ సాఫీగా కసరత్తు చేయ విధిగా సాఫల్య మౌనీ పనుల్ కాఫీ లేకనె పూర్తి చేయు ముసదా కార్యమ్ము నిశ్చింతగా… కోట శర్మ శా: కాఫీ వీడుము...

Read More

దశమత్వమసి

దశమత్వమసి కం. పదుగురు శిష్యులు నీదుచు నదమున కావలి తటమ్మునకు చేరగ నా నదిలో మునిగెనొకడనుచు పదుగురు యేడ్చిరి గణించి పలు విధములుగన్ తనను విడిచి తక్కిన వా రిని పలు మారులు గణించిరి యని గని హితుల్ కనపడని పదవ వానిగ తననే చూపగ నెరింగి...

Read More

భజగోవిందము – ద్విపదమాలికలో

భజగోవిందము – ద్విపదమాలికలో 1. భజియించు గోవిందు -భజియించు సతము త్యజియించి మోహమున్ – దరియించు భవము 2. వీడుమత్యాశను -విత్తార్జనమున వీడుమాశలనెల్ల- విమలచిత్తమున సరియైన రీతిలో -సంపదల్ పొంది పరితుష్టి కలిగుండు -బాధలన్ వీడి...

Read More

పేకాటతోయఘులు

మత్తేభ (అశ్వధాటి,సితస్తవకః)   ఏకాలముంగనిన నాకాలమందునను పేకాటలాడదగునే పేకాటరాయుడులు యేకాడికీవదల నాకాటలోకమనుచున్ పేకాటతోయఘులు ప్రాకారమున్నిలిపి యేకాకిలాబ్రతుకుచున్ నాకారులైయిటుల లోకాలనుమ్మరచి పేకాటతోగడపగన్ చేకావలిన్ దులిపి...

Read More

తత్వ చింతన – అవస్థాత్రయ వివరణ

తత్వ చింతన – అవస్థాత్రయ వివరణ కం. మెలకువ నిదురయు కలలను త్రిలోక ములలో మనుజుడు తిరుగును నిలలో మెళుకువతో లోకమ్ములు తిలకించగ విదితమగును తీరు తరింపన్ కం. మెలగును తనువును మనసును మెలకువలో, మనసొకటియె మెదలును కలలో కలిపించి లేని...

Read More

సరదాగా సన్నివేశము

ప్రజ – పద్యం గ్రూపు లో ఇచ్చిన సరదాగా సన్నివేశము పై వ్రాసినవి 1. మ.కో ఎల్లవేళల వాయుయానము నెంచి సంతసమొందుచున్ వెళ్లదీసెను చాలకాలము విర్రవీగుచు గర్వియై వల్లకాక విమానయానము వార్థిలోపడినట్టులన్ చిల్లిపడ్డటులుండిగుండెన...

Read More

తత్వమసి..స్వామి వివేకానందుడి దృష్టాంతము ఆధారంగా

తత్వమసి స్వామి వివేకానందుడి దృష్టాంతము ఆధారంగా మత్తకోకిల తల్లినుండొక పిల్ల సింహము దారి తప్పగ దూరమై వెళ్ళిచేరెను గొర్రెమందన భీతితో విలపించుచున్ యెల్లవేళల గొర్రెగా బ్రతుకీడ్చు చుండెను మందలో నల్లవేరొక సింహమావిషయమ్ము చూసెను వింతగన్...

Read More

నాన్న..

నాన్న.. ఉ. సంతతితోడనాడుచును సఖ్యుడుగా మురిపించు నాన్న యా సంతుకు సంప్రదాయమును సన్మతి సంపదలిచ్చు నొజ్జయై సంతతి సంతసించుటకు సంతతమున్ శ్రమియించుచుండి తా సంతసమొందు నాన్న తన సర్వము త్యాగము చేసి వారికై ..కోట...

Read More

ఈశావాస్యోపనిషత్

ఈశావాస్యోపనిషత్-1 సీసం పరమాత్మ తత్త్వమ్ము పరిపూర్ణమైనట్టి దాద్యంతములులేనిదట్టియాత్మ ఆయాత్మనుండియే నావిర్భవించెనీ నశ్వరంబగునట్టి విశ్వమంత నామరూపాదులే నాశమౌ జగతిలో నాభాస జనితమ్ములాత్మలోన భ్రమవీడి జ్ఞానియై పరికించ విశ్వమే...

Read More

విజయవాడ శ్రీదుర్గమ్మా

కం జననీయని జగదంబను జనులందరు శరణువేడ సతతమ్మిలలో కనిపించని పరతత్వమె కనపించెడి దుర్గ మాతగాదిగి వచ్చెన్ అమ్మలకమ్మగ నిన్నే నమ్మితి నమ్మా మనమున నామస్మరణ మ్మిమ్ముగ చేసెద జ్ఞానము నిమ్మని కోరుచు ననయము నిన్నే జననీ తవచరణము మమ శరణము భవాని...

Read More
Loading