లవ్ -ఇష్క్ -కాదల్ – ప్యార్ 2025

By venkat ramesh

Updated on:

లవ్

లవ్ -ఇష్క్ -కాదల్ – ప్యార్ 2025

 

 రంగు విల్లులన్ని రెక్కలు కట్టుకొని

 రంగవల్లులన్ని చీరలు చుట్టుకొని

వానజల్లులన్ని అత్తరలు అద్దుకొని

నిన్ను చేరాయా, స్నేహము చెయ్యమని.

 

మబ్బులు అన్నీ ముసుగేసుకొని

ఉరుములు అన్నీ సడి చేసుకొని

మిణుగురులన్నీ వెలుగు పూసుకొని

 హిమగిరులున్ని మంచుకప్పుకొని

 నిన్ను చేరాయా, అల్లరి చెయ్యమని.

 

విరులన్ని విరబూసి  నవ్వి

ఝరులన్నీ ఉప్పొంగి దూకి

కలలన్నీ నిజముగా మారి

అలలన్నీ ఆవిరిగా మారి

నిన్ను చేరాయా, ఊసులు చెప్పమని.

లవ్ -ఇష్క్ -కాదల్ – ప్యార్ 2025

Leave a Comment