గాలిపటం వినమంటోంది
మన జీవితం గాలిలో దీపమే కాదు
గాలిలో గాలిపటం కూడా.
గాలిపటాన్ని నియంత్రించే ఆదారాలు, దారాలు,
మనం జీవితాన్ని నియంత్రించుటకు తీస్కునే నిర్ణయాలు.
గాలి వీచే దిక్కు, కోణం,
మనం సమస్యలును, జీవితాన్ని చూసే దృక్కోణం, దృష్టి.
![]() |
www.telugukavitaluu.com |
గాలిపటం ఎత్తులో ఎగరడం,
మనం జీవితంలో విజయం సాధించడం.
గాలిపటం ఎగరలేక నేలరాలడం,
మనం జీవితాన్ని గెలవడంలో ఓడడం.
గాలిపటం కొమ్మలరెమ్మల్లో, సందు గొందుల్లో చిక్కుకోవడం, మనం సాదక బాధల్లో, బంధాలు-బంధుత్వాల్లో బంధీకావడం.
గాలిపటం మిగతా పటాలకంటే పైకెగిరే ప్రయత్నం,
మనం జీవితంలో పైకి ఎదగడానికి చేసే పోరాటం, పోటీతత్వం .
![]() |
www.telugukavitaluu.com |
గాలిపటం సులువుగా ఒడుపుగా గాల్లో ఎగరడం, జీవితంలో బాదల్లో కూరుకుపోయిన, ఆనందంగా బ్రతకడం
గాలిపటం ఒక్కొకటి ఒక్కొ ఎత్తులో ఎగురుతుంది. ఎవరిశక్తి వారిది, ఎవరి లక్ష్యం వారిది, తోటివారితో కొలతలు – కొలమానలు వద్దని అర్థం.
గాలిపటం దారంతోపాటు చేతి నుండి విడిపోవడం,
మన జీవితం బానిసత్వం, తోలుబొమ్మలాట పరం.
గాలిపటం ఎత్తులో ఉన్నా క్రింద ఎగరేసేవాడి మాట వినడం మనం జీవితంలో అమ్మ-నాన్న, గురువు శ్రేయాభిలాసి మాట వినడం.
తెగిన గాలిపటం – అదుప తప్పిన జీవితం