ప్రేమ కవిత : కలిసి అడుగేస్తే
నా వేలు పట్టి నువ్వే అడుగేస్తే
కుళ్ళుకోవా చిలకా -గోరింకే
దారిపట్టి మనమే పోతాంటే
కంటగింపులేగా ఊరంతా
తారవేమొ నువ్వు,
జాబిలి నేను
నింగే మన ఆవాసం
కలువవేమో నీవు,
కొలనను నేను
జన్మంతా సావాసం
చీరకట్టు, బొట్టు ఎట్టు
ఓ పిల్లా ! కడదామే జట్టు…ఏ ఓ పిల్లా!
సంద్రం ఎంత ఉన్నా,
నది చిన్నదైనా
తారతమ్య భేదం చూపదుగా
దూరం ఎంత ఉన్నా,
దారి ఏదైనా వేచి చూసేది తనేగా
మేడలో రాజుకైనా, మిద్దెలో రైతుకైనా
ప్రేమ పలకరిస్తే, తనువంతా తుళ్ళింతే
కోటలోని రాణి అయినా, పేటలోని వాణి అయినా
వలపు పులకరిస్తే, మదినిండ కేరింతే
ఓ….. పేద, ధనిక భేదం చూసి, చిన్నా పెద్దా సైజులు చూసి పుట్టదు రా ప్రేమ.
కులము, బలము వేరే అయినా,
ఈడు జోడు సరిలేకున్నా. మనసు, మనసు ఒక్కటైతే పెనవేస్తది రా ప్రేమ
Also Read :
Add Your Heading Text Here
Table of Contents
Toggle